Tourism: సింగపూర్‌కు క్యూ కడుతున్న భారతీయులు.. కీలక నిర్ణయం తీసుకున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్!

ABN , First Publish Date - 2022-08-03T23:41:28+05:30 IST

విహార యాత్ర కోసం భారతీయులు సింగపూర్‌కు క్యూ కడుతున్నారు. సింగపూర్ ప్రభుత్వం(Singapore Govt) తాజాగా విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో సందర్శించిన విదేశీ పర్యాటకుల జాబితాను

Tourism: సింగపూర్‌కు క్యూ కడుతున్న భారతీయులు.. కీలక నిర్ణయం తీసుకున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్!

ఎన్నారై డెస్క్: విహార యాత్ర కోసం భారతీయులు సింగపూర్‌కు క్యూ కడుతున్నారు. సింగపూర్ ప్రభుత్వం(Singapore Govt) తాజాగా విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో సందర్శించిన విదేశీ పర్యాటకుల జాబితాను సింగపూర్ తాజాగా వెల్లడించింది. ఆ దేశాన్ని విజిట్ చేసిన అత్యధిక విదేశీ పర్యాటకుల జాబితాలో భారత్ టాప్ 2లో నిలిచిందని లెక్కలు చెబుతున్నాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కరోనా(Corona) వల్ల భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ ఆంక్షలు అమలులోకి రావడంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా ఆంక్షలు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. మహమ్మారి ప్రభావం తగ్గడంతో.. రిలాక్స్ అవడానికి విహార యాత్రకు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే పలు దేశాలకు చెందిన 1.5 మిలియన్ల టూరిస్ట్‌లు సింగపూర్‌(Singapore)ను సందర్శించారు. ఇందులో భారత్‌కు చెందిన టూరిస్ట్‌(Tourists)ల సంఖ్య 2.19లక్షల వరకు ఉంది. ఇండోనేషియాకు చెందిన 2.82లక్షల మంది పౌరులు సింగపూర్‌ను విజిట్ చేశారు. కాగా.. ప్రపంచ పర్యాటకులకు సింగపూర్ ఫస్ట్ ప్రియారిటీగా ఉండటానికి ఆ దేశ ప్రభుత్వం కొవిడ్‌ను అరికట్టిన తీరు ఒక కారణం కాగా.. అక్కడి సందర్శనీయ ప్రదేశాలు రెండో కారణం. 


ఇదిలా ఉంటే.. ఇండియా పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశ పర్యాటకానికి మరింత ఊతం ఇచ్చేలా సింగపూర్ ఎయిర్‌లైన్స్(Singapore Airlines) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నై-సింగపూర్ మధ్య వారానికి 10 విమానాలు అందుబాటులో ఉండగా.. వాటి సంఖ్యను 17కు పెంచే ఆలోచన చేస్తోంది. అదే విధంగా కొచ్చి, బెంగళూరుకు ప్రస్తుతం వారానికి 7 చొప్పున సర్వీసులుగా ఉండగా.. వాటిని వరుసగా 14,16చొప్పున పెంచనున్నారు. 


Updated Date - 2022-08-03T23:41:28+05:30 IST