WHO : 20 లక్షల మందికి ఉద్యోగాలే ఉరితాళ్లు!

ABN , First Publish Date - 2021-09-19T01:14:50+05:30 IST

ఇది నిజంగా ఆందోళన కలిగించే సత్యమే. వందలు, వేలు కాదు లక్షల్లో జనం చనిపోవటానికి కారణం... వారు చేసే ఉద్యోగాలేనట. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ సంయుక్తంగా చేసిన తాజా అధ్యయనంలో ఈ అంచనాలు బయటపడ్డాయి.

WHO : 20 లక్షల మందికి ఉద్యోగాలే ఉరితాళ్లు!

ఇది నిజంగా ఆందోళన కలిగించే సత్యమే. వందలు, వేలు కాదు లక్షల్లో జనం చనిపోవటానికి కారణం... వారు చేసే ఉద్యోగాలేనట. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ సంయుక్తంగా చేసిన తాజా అధ్యయనంలో ఈ అంచనాలు బయటపడ్డాయి. సుదీర్ఘమైన పని గంటల కారణంగా తలెత్తే అనారోగ్యాలు, వాయు కాలుష్యం వల్ల అటుఇటుగా ప్రతీ సంవత్సరం 20 లక్షల మంది అసువులు బాస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 


2016 ఒక్క సంవత్సరంలోనే, ప్రపంచ వ్యాప్తంగా 19 లక్షల మంది, ఉద్యోగ సంబంధమైన సమస్యలతో కుప్పకూలారట. ‘‘ఉద్యోగాలే ఉరితాళ్లుగా మారి, ఇంత మంది జనం చనిపోవటం, విభ్రాంతి కలిగించే పరిణామం’’ అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్. చాలా దేశాల్లో కార్మికులు, ఉద్యోగుల భద్రత, జీవన స్థితిగతులు త్వరితగతిన మెరుగవ్వాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఎంతైనా ఉంది.  

  

Updated Date - 2021-09-19T01:14:50+05:30 IST