కరోనా రిపోర్ట్: 24 గంటల్లో దాదాపు 150 కరోనా కేసులు.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2020-05-26T01:50:23+05:30 IST

బెంగాల్‌లో కొత్తగా దాదాపు 150 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక...

కరోనా రిపోర్ట్: 24 గంటల్లో దాదాపు 150 కరోనా కేసులు.. ఎక్కడంటే..

కలకత్తా: బెంగాల్‌లో కొత్తగా దాదాపు 150 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం..  గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 149 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. 75 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య 3,816కు చేరింది. 278 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 1,414 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,124 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-26T01:50:23+05:30 IST