24 గంటల్లో 3 లక్షల కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2021-04-21T16:44:59+05:30 IST

దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039కు చేరుకోగా, మృతుల సంఖ్య 1,82,553కు చేరుకుంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,57,538 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

24 గంటల్లో 3 లక్షల కోవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో మూడు లక్షల చేరువలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో కోవిడ్ రెండవ దశ తీవ్ర స్థాయిలో ఉంది. మొదటి దశలో వచ్చిన కేసుల కంటే రెండింతల కేసులు రెండవ దశలో వస్తున్నాయి. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశంలో తాజాగా ఒకే రోజులో 2,95,041 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,16,130కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 1,67,457 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, 2,023 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039కు చేరుకోగా, మృతుల సంఖ్య 1,82,553కు చేరుకుంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,57,538 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - 2021-04-21T16:44:59+05:30 IST