చిత్తూరు జిల్లా/తిరుపతి : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే తక్షణమే సాయం అందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, స్పెషల్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు గురువారం పిలుపునిచ్చారు. వాగులు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, తిరుపతిలోని పలుప్రాంతాలు నీట మునిగిన క్రమంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సహాయక బృందాలు సాయం అందిస్తున్నాయని చెప్పారు. అత్యవసరమైతే పోలీస్ డయల్ 100కుగాని, 63099 13960 నెంబరుకు ఫోన్‌చేసి పోలీస్ కంట్రోల్ రూమ్‌కుగాని, పోలీస్ వాట్సప్ నంబర్ 80999 99977 కు గాని ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. జిల్లా అంతటా పోలీసు సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌నుంచి సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఆయా ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది, అధికారులకు ఆదేశాలిస్తూ పర్యవేక్షించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
భారీ వర్షాల కారణంగా అనవసరంగా రోడ్లపైకి వచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఎస్పీ సెంథిల్‌కుమార్ సూచించారు. జిల్లావ్యాప్తంగా సహాయ చర్యల్లో పోలీసులు పాల్గొంటున్నారని, వారికి స్థానిక ప్రజలు సహకారం అందించాలని కోరారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున్న.. అవసరమైతే తప్ప ప్రజలు వాహనాల్లో లేదా నడిచి బయటికి రాకూడదన్నారు. ప్రజలకు అత్యవసర సేవల కోసం డయల్ 100, పోలీస్ వాట్సాప్ నెంబరు 9440900005 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
ఇవి కూడా చదవండి