భారత్‌లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు, 92 వేల మృతులు

ABN , First Publish Date - 2020-09-25T21:25:30+05:30 IST

భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య శుక్రవారంతో 58 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా..

భారత్‌లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు, 92 వేల మృతులు

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య శుక్రవారంతో 58 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 1,141 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 58,18,571కి చేరగా, ఇందులో 9,70,116 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 47,56,165 మంది పేషెంట్లు పూర్తిగా స్వస్థత చేకూరి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 92,290కి చేరింది.


దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 13 లక్షల కేసులు నమోదు కాగా, 6,54.385 కేసులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 24 వరకూ దేశంలో 6,89,28,440 కోవిడ్ పరీక్షలు జరిగాయి.

Updated Date - 2020-09-25T21:25:30+05:30 IST