రైతు శ్రేయస్సే సహకార బ్యాంకు లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-18T03:53:21+05:30 IST

రైతుల శ్రేయస్సే సహకార బ్యాంకు లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ శంకర్‌బాబు పేర్కొన్నారు.

రైతు శ్రేయస్సే సహకార బ్యాంకు లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న శంకర్‌బాబు

ఉదయగిరి, మే 17 : రైతుల శ్రేయస్సే సహకార బ్యాంకు లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ శంకర్‌బాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం స్థానిక కేంద్ర సహకార బ్యాంక్‌ సిబ్బందితో సమీక్షించారు. రైతుల నుంచి రుణాల రికవరీ 90 శాతం జరగాలన్నారు. ఈ ఏడాది 528 కోట్లు డిపాజిట్లు సేకరించి 1400 కోట్ల రుణాలిచ్చి, 20 కోట్లు లాభాలు గడించే విధంగా ప్రణాళికను రూపొందించామన్నారు. సొసైటీల ద్వారా బంగారు రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలతోపాటు, పట్టణాల్లో గృహ నిర్మాణానికి రూ.15 లక్షలు, పల్లెల్లో రూ. 5 లక్షలలోపు రుణాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి అహ్మద్‌బాషా, మేనేజర్‌ రాజశేఖర్‌, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T03:53:21+05:30 IST