Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 20 Sep 2021 18:07:00 IST

కొత్త సీఎం చన్నీ రాజీనామాకు ఎన్‌సీడబ్ల్యూ డిమాండ్

twitter-iconwatsapp-iconfb-icon
కొత్త సీఎం చన్నీ రాజీనామాకు ఎన్‌సీడబ్ల్యూ డిమాండ్

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రిగా నియామకమైన కొద్ది సేపటికే చరణ్‌సింగ్ చన్నీపై ‘మీటూ’ అరోపణలు గుప్పుమన్నాయి. 2018లో ఆయనపై మీటూ ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని ప్రతిపక్ష పార్టీలు తిరగతోడుతున్నాయి. కాగా, తాజాగా మహిళా జాతీయ కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) సైతం లేవనెత్తింది. అంతటితో ఆగకుండా చన్నీ రాజీనామా చేయాలంటూ ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. వాస్తవానికి పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, 24 గంటలు కూడా కాకముందే ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్లు రావడం గమనార్హం.


ఆదివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్‌పై 2018నాటి మీటూ ఉద్యమ సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా పరిగణించి, ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కానీ ఏమీ జరగలేదు. ఈరోజు ఆయన పంజాబ్‌‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనను ఒక మహిళే ముఖ్యమంత్రిని చేయడం దారుణం. ఆయనపై విచారణ కొనసాగాలి. ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హులు. ఆయనను ముఖ్యమంత్రిగా తొలగించాలని మేము సోనియా గాంధీకి విజ్ణప్తి చేస్తున్నాం’’ అని అన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.