న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు పవార్ ఒక ట్వీట్‌లో తెలియజేశారు. అయితే ఆందోళన పడాల్సిన పని లేదని అన్నారు. వైద్యుల సలహా ప్రకారం చికిత్స తీసుకుంటున్నట్టు 81 ఏళ్ల పవార్ చెప్పారు. కొద్దిరోజులుగా తనను కలుసుకున్న వారు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి