Abn logo
Oct 18 2020 @ 21:49PM

చిరాగ్ పాశ్వాన్ బీజేపీ బి-టీమ్: ఎన్‌సీపీ తీవ్ర ఆరోపణలు

Kaakateeya

పాట్నా: బీహార్ శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 145 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాహత్ ఖాద్రీ తెలిపారు. మహాఘట్‌బంధన్, ఎన్‌డీఏకు తాము మూడో ఫ్రంట్‌గా అవతరిస్తామని పేర్కొన్నారు. ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌పై ఖాద్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. చిరాగ్‌ను బీజేపీ ‘బి-టీమ్’గా అభివర్ణించారు. తాము ఎన్‌డీయేలో భాగమేనని చెబుతున్న ఎల్‌జేపీ, మరోవైపు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని పేర్కొన్నారు. 

దీని వెనక నితీశ్ కుమార్‌ను దెబ్బతీయాలన్న బీజేపీ కుట్ర దాగి ఉందన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రచారం చేస్తారని ఖాద్రీ తెలిపారు. 243 శాసన సభ స్థానాలున్న బీహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఈ నెల 28న జరగనుండగా, రెండో విడత నవంబరు 3న, మూడో విడత 7న జరగనున్నాయి. 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Advertisement
Advertisement
Advertisement