నాయకత్వ లక్షణాల పెంపుదలకు కృషి

ABN , First Publish Date - 2020-11-25T06:34:49+05:30 IST

భానుగుడి (కాకినాడ) నవంబరు, 24: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్‌సీసీ కృషి చేస్తుందని ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ టీఎ్‌సఎస్‌ కృష్ణన్‌ తెలిపారు. సిద్ధార్థనగర్‌లోని ఎన్‌సీసీ గ్రూపు హెడ్‌క్వార్టర్స్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.

నాయకత్వ లక్షణాల పెంపుదలకు కృషి
సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణన్‌

ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ టీఎ్‌సఎస్‌ కృష్ణన్‌ 

భానుగుడి (కాకినాడ) నవంబరు, 24: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్‌సీసీ కృషి చేస్తుందని ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ టీఎ్‌సఎస్‌ కృష్ణన్‌ తెలిపారు. సిద్ధార్థనగర్‌లోని ఎన్‌సీసీ గ్రూపు హెడ్‌క్వార్టర్స్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి దళాల్లో చేరే విధంగా ప్రోత్సహించడం ఎన్‌సీసీ ముఖ్య లక్షణమన్నారు. ప్రతీ సంవత్సరం శిక్షణలో ప్రతిభ చూపే కేడెట్లకు రూ.6వేల చొప్పున వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌, ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రిజర్వేషన్‌ ఉంటుందని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-11-25T06:34:49+05:30 IST