Advertisement
Advertisement
Abn logo
Advertisement

రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ దినోత్సవం

జగిత్యాల అర్బన్‌, నవంబరు 28: పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాఽశాలలో 73వ ఎన్‌సీసీ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ వే డుకలను పురస్కరించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎన్‌సీసీ కేడెట్లకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించి, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్ట ణంలోని స్థానిక భగినీ నివేదిత ఆశ్రమంలో బాలికలకు నిత్యావసర సరు కులు అందించి, వసతి గృహంలో స్వచ్చభారత్‌ కార్యక్రమం నిర్వహిం చా రు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కొక్కుల రాజేంధర్‌, ఎన్‌సీసీ అ ధికారి లెఫ్టినెంట్‌ మారుతి శ్రీహరిరావు, ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.


Advertisement
Advertisement