విజ్ఞాన్‌లో ఎన్‌సీసీ ఏ సర్టిఫికెట్‌ పరీక్ష

ABN , First Publish Date - 2021-02-28T06:45:12+05:30 IST

పట్టణంలో విజ్ఞాన్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో శనివారం ఎన్‌సీసీఏ సర్టిఫికెట్‌ పరీక్ష జరిగింది.

విజ్ఞాన్‌లో ఎన్‌సీసీ ఏ సర్టిఫికెట్‌ పరీక్ష
పరీక్ష రాస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లు

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 27 : పట్టణంలో విజ్ఞాన్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో శనివారం ఎన్‌సీసీఏ సర్టిఫికెట్‌ పరీక్ష జరిగింది. కంచికచర్ల విజయరాణి హైస్కూల్‌ నుంచి 49 మంది, విజ్ఞాన్‌స్కూల్‌ నుంచి 30 మంది, లిటిల్‌ ఏంజిల్స్‌ హైస్కూల్‌ నుంచి 26 మంది క్యాడెట్లు పరీక్షలకు హాజరుకాగా, 17వ ఆంధ్రా బెటాలియన్‌ సుబేధార్‌  సూర్యశంకరప్రసాద్‌, హవల్ధార్‌ గురుంగ్‌ పర్యవేక్షించారు.  పరీక్షల అనంతరం క్యాడెట్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాజీ చైర్మన్‌, విజ్ఞాన్‌ స్కూల్‌ అధినేత తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌సీసీలో చేరటం వల్ల దేశభక్తి, క్రమశిక్షణ, సేవాదృక్పథం అలవడతాయన్నారు.  ఎన్‌సీసీకి గ్రామీణప్రాంతాల్లో ప్రాచుర్యం కల్పించాలని కోరారు. విజ్ఞాన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ తన్నీరు సుధారాణి, ఎన్‌సీసీ ఆఫీసర్‌లు పి.ఎస్‌.రెడ్డి, వీవీ ప్రసాద్‌, రాజారావు పాల్గొన్నారు. 



Updated Date - 2021-02-28T06:45:12+05:30 IST