మహారాష్ట్ర మంత్రి అల్లుడికి డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు...వ్యాపారికి ఎన్సీబీ summons

ABN , First Publish Date - 2022-02-22T14:00:41+05:30 IST

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌కు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలున్నాయని ఎన్సీబీ అధికారులు చెప్పారు...

మహారాష్ట్ర మంత్రి అల్లుడికి డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు...వ్యాపారికి ఎన్సీబీ summons

ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌కు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలున్నాయని ఎన్సీబీ అధికారులు చెప్పారు.ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి సమీర్ ఖాన్ తో సంబంధాలున్న బ్రిటిష్ జాతీయుడు, వ్యాపారవేత్త కరణ్ సజ్నానీకి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు ​​జారీ చేసింది.సమీర్ ఖాన్‌పై గత ఏడాది ముంబై ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బ్రిటిష్ జాతీయుడైన వ్యాపారవేత్త కరణ్ సజ్నానిని వచ్చే వారం విచారణకు పిలిచినట్లు ఎన్సీబీ అధికారులు సోమవారం తెలిపారు.ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొంటూ తనపై ఉన్న ఎన్సీబీ కేసును రద్దు చేయాలని వ్యాపారవేత్త ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు.


గత ఏడాది ఏజెన్సీ మాజీ జోనల్ హెడ్ సమీర్ వాంఖడే, అతని బృందంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై ముంబై ఎన్‌సిబి జోనల్ కార్యాలయంలోని ఆరు కేసులను ఇక్కడ ఉన్న సిట్ కు బదిలీ చేసింది.అక్టోబర్ 2020 కార్డెలియా క్రూయిజ్ డ్రగ్స్ కేసుల నేపథ్యంలో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో సహా 20 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.ఈ కేసులో గతంలో కూడా సజ్నానిని గత ఏడాది ముంబైలో సిట్ విచారించింది. ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని అతని ఇంటిపై యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీ దాడి చేసి సుమారు 200 కిలోల నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


ఫోరెన్సిక్ విశ్లేషణలో స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో మాదకద్రవ్యాలు కనుగొనలేదని సజ్నానీ తన ఇటీవలి కోర్టు పిటిషన్‌లో పేర్కొన్నారు.ఇదే కేసులో సమీర్ ఖాన్‌ను గతేడాది జనవరిలో ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. సెప్టెంబర్‌లో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 


Updated Date - 2022-02-22T14:00:41+05:30 IST