Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 28 Oct 2021 16:23:28 IST

గాంధీ జయంతి రోజయినా Aryan Khan వాటికి దూరంగా ఉండాల్సింది.. బెయిల్ పిటిషన్‌పై ఎన్సీబీ వాదనలివీ..!

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రెండ్రోజులుగా ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ తరపున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, అమిత్ దేశాయ్ వాదలను వినిపించారు. తమ క్లయింట్లను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, ఇంత చిన్న కేసులో అవసరం లేకున్నా వారిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. నేరం రుజువు అయితే కేవలం ఏడాది శిక్ష పడే కేసు విషయంలోనే తాము బెయిల్‌ను అడుగుతున్నామని వివరించారు. ఆర్యన్ ఖాన్ వద్ద అసలు ఏమీ దొరకకున్నా అతడి పక్కన ఉన్న వ్యక్తి వద్ద దొరికితే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమో గుర్తించాలన్నారు. తాజాగా గురువారం ఈ కేసులో ఎన్సీబీ తరపున అడిషినల్ సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. 

‘ఆర్యన్ ఖాన్ వద్ద మాదకద్రవ్యాలు ఏమీ దొరకలేదని అంటున్నారు. నిజమే కానీ అతడు ఈ కేసులో కీలక వ్యక్తి. అతడు నిన్న మొన్న కాదు కొన్నేళ్ల నుంచి మాదకద్రవ్యాలు స్వీకరిస్తున్న వ్యక్తి. అతడి వాట్సప్ చాటింగ్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్స్‌ నెంబర్స్ ఉన్నాయి. వాళ్లతో చాటింగ్స్ ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ మద్యవర్తిగా ఉండి చాలా మంది ప్రముఖులకు డ్రగ్స్‌ను సరఫరా చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. స్నేహితుడి వద్ద డ్రగ్స్ ఉన్నాయని ఆర్యన్ ఖాన్‌కు ముందే తెలుసు. అవి అందరూ వాడటానికి తీసుకొచ్చుకున్నవే తప్పితే ఒక్కరి కోసం కాదు. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ కలిసి పెరిగారు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేస్తారు. వారి సోషల్ మీడియా ఖాతాలు చూస్తేనే అది అందరికీ అర్థం అవుతుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉంటారు. తాము డ్రగ్స్ తీసుకున్నామా..? లేదా అన్నది పరీక్షించలేదని నిందితులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం అది కాదు. వాళ్లు ఈ ప్రొఫెషన్‌‌లో ఉన్నారా..? లేదా..? అన్నదే ముఖ్యం. A1 నిందితుడు అయిన ఆర్యన్ ఖాన్‌కు అక్కడ డ్రగ్స్ పార్టీ జరగబోతోందని ముందే తెలుసు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోనప్పటికీ, అతడి వద్ద డ్రగ్స్ దొరకనప్పటికీ ఆ వ్యవహారాల్లో అతడే కీలకంగా వ్యవహరించాడు. తదుపరి విచారణకు అతడు ఎంతో కీలకం..’ అని ఎన్సీబీ తరపున లాయర్ వాదనలు వినిపించారు. 

‘తదుపరి విచారణకు ఆర్యన్ ఖానే కీలకమని అతడి వాట్సప్ చాటింగ్ ద్వారా స్పష్టం అవుతోంది. దాడులు నిర్వహించినప్పుడు నిందితుల వద్ద నుంచి ఎనిమిది రకాల వేరు వేరు మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. వారి అరెస్ట్ జరిగింది అక్టోబర్ 2వ తారీఖు.. ఆ రోజు గాంధీ జయంతి. గాంధీ జయంతి రోజున ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సి ఉంది. ఆరోజున ‘బ్లాస్ట్’ చేద్దామంటూ మాట్లాడుకున్నారంటే వాటికి అర్థం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేసులో కీలకం అనే దాన్ని బట్టి బెయిల్‌ను తిరస్కరించవచ్చునన్నది ఎన్‌డీపీఎస్ చట్టంలో ఉంది. మేం చేస్తున్న వాదనలు అన్నీ తప్పని నిందితుల తరపున లాయర్లు ప్రూవ్ చేసి బెయిల్ అడగాల్సింది పోయి.. కేవలం రిమాండ్‌ను మాత్రమే రద్దు చేసి బెయిల్‌ను ఇవ్వమని కోరడం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.’ అని ఎన్సీబీ తరపున లాయర్ చెప్పుకొచ్చారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement