Abn logo
Sep 16 2020 @ 20:46PM

నాగశౌర్య కూడా ప్రారంభించేశాడు!

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎస్వీసీఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాగ‌శౌర్య 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. 


ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రోజు (బుధవారం) ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ మొదలు పెట్టారు. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు `పార్థు` అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement