నకిలీపై నజరేదీ?

ABN , First Publish Date - 2022-05-04T04:49:08+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తుండడంతో మళ్లీ ఈసారి కూడా నకిలీ పత్తివిత్తనాల జోరు కనిపిస్తోంది. దళారులు ముందు చూపుతో రహస్యం గా నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టెందుకు ప్రణాళిక చేస్తున్నారు. జిల్లాలో సాగయ్యే పత్తిపంట సాగులో 30 నుంచి 40 శాతం బీటీ-3 (చోర్‌ బీటీ) విత్తనాలే కావడం గమనార్హం. ప్రతీ ఏ టా జిల్లాలో సీజన్‌కు ముందు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం, కే సులు నమోదు చేయడం పరిపాటిగానే మారుతుంది.

నకిలీపై నజరేదీ?
పట్టుకున్న నకిలీ విత్తనాలతో పోలీసులు (ఫైల్‌)

గ్రామాల్లోకి చేరుతున్న నకిలీ పత్తి విత్తనాలు

పత్తాలేని టాస్క్‌ఫోర్స్‌ అధికారుల కమిటీలు

మళ్లీ బీటీ-3 పైనే పత్తి రైతుల ఆసక్తి

రహస్యంగా అంటగడుతున్న వ్యాపారులు

ఆదిలాబాద్‌, మే3 (ఆంధ్రజ్యోతి) ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తుండడంతో మళ్లీ ఈసారి కూడా నకిలీ పత్తివిత్తనాల జోరు కనిపిస్తోంది. దళారులు ముందు చూపుతో రహస్యం గా నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టెందుకు ప్రణాళిక చేస్తున్నారు. జిల్లాలో సాగయ్యే పత్తిపంట సాగులో 30 నుంచి 40 శాతం బీటీ-3 (చోర్‌ బీటీ) విత్తనాలే కావడం గమనార్హం. ప్రతీ ఏ టా జిల్లాలో సీజన్‌కు ముందు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం, కే సులు నమోదు చేయడం పరిపాటిగానే మారుతుంది. 

జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,72,381 ఎకరాలు 

జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5లక్షల 72వేల 381ఎకరాలు కాగా సు మారు 4లక్షల ఎకరాలకు పైగా పత్తి పంట సాగుకానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రైతులు వేసవి దుక్కులు, సేంద్రీయ ఎరువుల తరలింపు పనుల్లో నిమగ్నమయ్యారు. పక్షం రోజుల్లో రైతులు వి త్తనాలు, ఎరువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. జిల్లాలో తొలకరి వర్షాలకే పత్తి, సోయాబీన్‌ పం టలను వేస్తారు. ఈ నెల చివరిలో తొలకరి వర్షాలు కురిస్తే విత్తేందుకు ఎరువులు, విత్తనాలను సిద్ధం చే సుకుంటున్నారు. ఈ యేడు సకాలంలో నే సంవృద్ధిగా వర్షాలు కురుస్తాయని వా తావరణ శాఖ వెల్లడించడంతో రైతులు వానా కాల పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడు వర్షాధారంగా పండించే పత్తి పంటకు మద్దతు ధర భారీగా పెరుగడం ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం, ప్రభుత్వం ఈ పంటను ప్రోత్సహించడంతో ఎ క్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా రు. పర్యావరణం దెబ్బతినడంతో పాటు రైతులకు అన్ని రకాల నష్టం కలిగించే బీటీ-3 పత్తి విత్తనాలపై ప్రభుత్వం ని షేధం విధించినా రైతులు మాత్రం సా గు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా దళారులు గుట్టు చ ప్పుడు కాకుండా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. 

ముందు చూపు లేని అధికారులు

నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు అధికారులకు ముందు చూపు కరువవుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా వ్యవసాయ శాఖ అధికారుల తీరు కనిపిస్తుంది. వానాకాల సీజన్‌ దగ్గర పడడంతో వ్యాపారులు, రైతు లు విత్తనాలు, ఎరువులపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడుకాకుండా నకిలీ విత్తనాలను రైతులకు అంట గట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీఏటా జిల్లాలో నకిలీ విత్తనాల దందా వెలుగు చూస్తునే ఉంది. అయినా అధికారులు కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. పోలీసులు, వ్య వసాయ శాఖఅధికారుల సమయన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా సరిహద్దులు, ఫర్టిలైజర్‌ దుకాణాలపై ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉంది. 

బీటీ-3 పైనే ఆసక్తి..

నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాల పైననే రైతులకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే కలుపు నివారణ లేకుండా పంట దిగుబడులు చేతికి వచ్చే అవకాశం ఉన్న బీటీ-3 కోసం ఆసక్తి చూపుతున్నారు. కొన్నేళ్లుగా ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించిన అమ్మకాలు మాత్రం కొనసాగుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని విక్రయించేందుకు కొందరు వ్యాపారు లు గ్రామాల్లో ప్రతినిధులను నియమించుకొని వారి ద్వారా రైతులకు అందజేస్తున్నారు. ఏజెంట్లకు ఎంతో కొంత కమీషన్‌ ఆశచూపుతూ విక్రయాలు పెంచుకుంటున్నారు. 750 గ్రా ముల బీటీ-3 పత్తి విత్తన ప్యాకెట్‌ ధర డిమాండ్‌కు అనుగుణంగా రూ.800 నుంచి రూ.1200 వ రకు అమ్ముతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతుల వద్దకు బీటీ-3 విత్తనాలు చేరడంతో విత్తేందు కు సిద్ధమవుతున్నారు. తొలకరి వర్షాలు కురవగానే సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతుల డిమాండ్‌ ను బట్టి ఆయా గ్రామాల్లో నకిలీ విత్తనాలను నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రహస్యంగా దిగుమతి..

వ్యాపారులు నిషేధిత పత్తి విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి బీటీ-3 వి త్తనాలు జిల్లాకు సరఫరా అవుతున్నటేకల తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా తదితర ప్రాం తాల నుంచి భారీగా తరలిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టుబడిన నకిలీ విత్తనాలన్నీ ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి తరలించినవేనని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు అ దును చూసి వివిధ మార్గాలలో సరఫ రా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా నిల్వ చేసుకున్న పత్తి విత్తనాలను రహ స్యంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లలో గ్రామాలకు తరలిస్తూ సొమ్ము చేసు కుంటున్నారు. అధికారులు మాత్రం అ ప్రమత్తమైనట్లు కనిపించడం లేదు. 

త్వరలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తాం..

రమేష్‌బాబు (ఏడీఏ, ఆదిలాబాద్‌)

నకిలీ విత్తనాల కట్టడిపై రెండు రోజుల క్రితమే రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం జరిగింది. త్వరలోనే టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తాం. జిల్లా, మండల స్థాయిలో తనిఖీలను నిర్వహిస్తాం. నకిలీ విత్తనాల కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపారులు నకిలీ, నిషేదిత విత్తనాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Read more