ప్రజా పంపిణీపై నజర్‌

ABN , First Publish Date - 2022-08-07T05:17:41+05:30 IST

జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాయింట్‌ కలెక్టర్‌ మోతిలాల్‌ చేస్తున్న కృషి సత్ఫలి తాలను ఇస్తోంది.

ప్రజా పంపిణీపై నజర్‌
బియ్యం తూకాన్ని పరిశీలిస్తున్న జేసీ

- ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

- జిల్లాలో ఇప్పటి వరకు 194 బియ్యం అక్రమ తరలింపు కేసులు

- 21 రైస్‌ మిల్లులపై కొరడా

- గాడిలో పడుతున్న వ్యవస్థ


నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాయింట్‌ కలెక్టర్‌ మోతిలాల్‌ చేస్తున్న కృషి సత్ఫలి తాలను ఇస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో ఆయన చేస్తున్న ఆకస్మిక తనిఖీలు, నమోదు చేయిస్తున్న కేసుల కారణంగా పౌరసరఫరాల వ్యవస్థ క్రమంగా చక్కబడుతోంది. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వ కుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని ఏడు స్టాక్‌ పాయింట్లు, 558 చౌకధర డిపోల్లో అక్రమాలను నియంత్రించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ మోతిలాల్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తు న్నారు. స్టేజ్‌-1 నుంచి జిల్లాకు వస్తున్న బియ్యం, స్టేజ్‌-2లో నిల్వలు గణాంకాలు తప్పకుండా సమీక్షిస్తూనే.. స్టాక్‌ పాయిం ట్లపై కూడా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. చౌకధర దుకాణాల ద్వారా లబ్ధిదారులకు జరుగుతున్న బియ్యం పంపి ణీపై కూడా గ్రామీణ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేపడుతుండడంతో అక్ర మార్కుల్లో దడ పుడుతుంది. జిల్లాలో రెండు లక్షలా 38 వేలా 841 రేషన్‌కార్డులు ఉన్నాయి. నెలకు 4,900 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందిస్తున్నారు. గతంలో స్టాక్‌ పాయింట్లు, డీలర్ల వద్ద నుంచి మిల్లులకు రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా జరిగేది. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ మోతిలాల్‌ కస్టమ్‌ మిల్లింగ్‌పై దృష్టి సారిం చారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు ఏయే మిల్లుకు ఎంత వెళ్లింది, అక్కడ ఉన్న నిల్వలపై మొదట వివరాలు సేకరించిన ఆయన, ఆ తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ స్టాక్‌ పాయింట్లపై దృష్టి పెట్టారు. స్టాక్‌ పాయింట్లలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కింది స్థాయి ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించి, తనిఖీలు చేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. స్టాక్‌ పాయిం ట్లు, డీలర్ల వద్ద జరుగుతున్న అక్రమాలను నిరోధించే ప్రయ త్నం చేస్తున్న జేసీ మూడో దశలో రేషన్‌కార్డు హోల్డర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్‌ మిల్లులు, లిక్కర్‌ కంపెనీలకు అక్రమంగా చేరుస్తున్న వారి వివరాలను విజిలెన్స్‌ విభాగం ద్వారా సేకరిస్తుండడం గమనార్హం. 





క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

- మోతిలాల్‌, జాయింట్‌ కలెక్టర్‌, నాగర్‌కర్నూల్‌


పేదలకు పట్టెడన్నం పెట్ట డం కోసమే ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను రూపొం దించింది. ఆ వ్యవస్థను పక్క దారి పట్టించే వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. రేషన్‌ బియ్యం అక్రమ తర లింపు వ్యవహారంపై ప్రత్యే కంగా నిఘా పెట్టాం. ఇందులో భాగస్వాములయ్యే వారెవ్వరినీ ఉపేక్షించేది లేదు.


Updated Date - 2022-08-07T05:17:41+05:30 IST