ఆస్తి పన్ను వసూళ్లపై నజర్‌

ABN , First Publish Date - 2020-07-03T10:48:59+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకా యిలు

ఆస్తి పన్ను వసూళ్లపై నజర్‌

2019-20 ఆర్థిక సంవత్సరం టార్గెట్‌ రూ.1.46 కోట్లు

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో రూ.1.30 కోట్లు వసూలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేరుకోని లక్ష్యం

బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్న అధికారులు 


కాగజ్‌నగర్‌, జూలై2: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకా యిలు వసూలు చేసేందుకు ప్రణాళికలు రూపొం దించారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.1.46 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా రూ.1.30 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.16 లక్షలు రావాల్సి ఉంది.   మార్చి నెల నుంచి లాక్‌డౌన్‌ నేపథ్యంలో పన్నులు ఆశించిన మేర వసూలు కాలేదు. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.15లక్షలు రావాల్సి ఉండగా ఇందులో కేవలం రూ.3లక్షల మేర వసూలయ్యాయి.    పెండింగ్‌ బకాయిలు వసూలు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు పంపిస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలోని 30 వార్డుల్లో ఆస్తి పన్నుతో పాటు నల్లా కనెక్షన్ల బిల్లులు, వ్యాపార సంస్థల ట్రేడ్‌ లైసెన్సుల బిల్లులు కూడా వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు.


పేరుకుపోతున్న ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు  

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 23 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మార్చి నుంచి లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన బిల్లులన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా రూ.12లక్షల మేర పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇందులో తహసీల్దార్‌ కార్యాలయం నుంచి రూ.2 లక్షలు, ఎంపీడీఓ కార్యాలయం నుంచి రూ.1.5 లక్షలు, ఆర్‌ అండ్‌బీ కార్యాలయం నుంచి రూ.1.5 లక్షలు, విద్యుత్‌ శాఖ నుంచి రూ.1.8 లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.4 లక్షలు, కార్మిక శాఖ నుంచి రూ.1.7 లక్షలు రావాల్సి ఉంది. అటవీ శాఖ నుంచి కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లింపులు చేశారు. మిగతా కార్యాలయాల నుంచి ఇంకా చెల్లింపులు చేయలేదు. అయితే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మున్సిపల్‌ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేస్తున్నారు.   


పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం-శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ 

ఆస్తి పన్ను వసూలుకు అన్ని చర్యలు తీసుకుం టున్నాం. రూ.1.46 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా ఇందులో రూ.1.30 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.16లక్షలు పెండింగ్‌ ఉంది. ఇక ప్రభుత్వ కార్యాల యాల నుంచి కూడా రూ.12 లక్షలు వసూలు కావాల్సి ఉంది. వీటి వసూలుకు కూడా పూర్తి స్థాయిలో  చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్‌ ఉన్న బకాయిల విషయంలో నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తున్నాం. త్వరలోనే బకాయిలు వసూలు చేస్తాం.


Updated Date - 2020-07-03T10:48:59+05:30 IST