ఆసుపత్రులపై నజర్‌

ABN , First Publish Date - 2022-06-26T06:30:39+05:30 IST

జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఆపరేషన్‌లపై జిల్లా యంత్రాంగం నజర్‌ పెట్టింది. ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలలో విచ్చలవిడిగా జరుగుతున్న సిజేరియన్‌లపై ఆరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ప్రసవాలు చేయని ఆసుపత్రులపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్యాకేజీల ద్వారా జరుగుతున్న

ఆసుపత్రులపై నజర్‌

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలపై దృష్టి

కలెక్టర్‌ ఆధ్వర్యంలో తనిఖీల కోసం 8 బృందాల ఏర్పాటు

వారంలోగా ఆసుపత్రులన్నీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వనున్న అధికారులు

సాధారణ ప్రసవాలు చేయని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు

సిజేరియన్‌లపై ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

గత కొన్నేళ్లుగా జిల్లాలో భారీగా కొనసాగుతున్న ఆపరేషన్‌లు

ప్రైవేట్‌ ఆసుపత్రుల వైపు దృష్టి సారించని వైద్య ఆరోగ్య శాఖ 

నిజామాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఆపరేషన్‌లపై జిల్లా యంత్రాంగం నజర్‌ పెట్టింది. ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలలో విచ్చలవిడిగా జరుగుతున్న సిజేరియన్‌లపై ఆరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ప్రసవాలు చేయని ఆసుపత్రులపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్యాకేజీల ద్వారా జరుగుతున్న ఈ సిజేరియన్‌ల ఒప్పందాలను పరిశీలిస్తున్నారు. ఏయే ఆసుపత్రుల్లో గత సంవత్సరం నుంచి ఎన్ని ప్రసవాలు జరిగాయి. వీటిలో ఎన్ని సిజేరియన్‌లు చేశారు? పరిశీలిస్తున్నారు. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవసరమైతే తప్ప సిజేరియన్‌లు చేయవద్దని ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులకు సూచిస్తున్నారు.

సిజేరియన్‌లపై యంత్రాంగం చర్యలు

జిల్లాలో జరుగుతున్న సిజేరియన్‌లపైన జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిం ది. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆద్వర్యంలో పలు దఫాలు చర్చించారు. వైద్య ఆరోగ్యశాఖ, ప్రైవేట్‌ నర్సింగ్‌హోం యజమానులతో సమీక్షించారు. పలుమార్లు చెప్పినా.. హెచ్చరించినా.. సిజేరియన్‌లు ఆగకపోవడంతో తనిఖీలకు నిర్ణయించా రు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎనిమిది బృం దాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రసవాలు చేసే 85 ఆసుపత్రుల్లో తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లను చేశారు. ప్రతీ బృందంలో ఒక జిల్లాస్థాయి అదికారితో పాటు మెడికల్‌ ఆఫీసర్‌ ఉండేవిధంగా ఈ బృందాలను నియమించారు. వీరి ఆధ్వర్యంలో శనివారం నగరం పరిధిలో తనిఖీలను మొదలుపెట్టారు. కొన్ని ఆసుపత్రుల్లోకి వెళ్లి రికార్డులను పరిశీలించారు. వచ్చే సోమవారం నుంచి అన్ని ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి కలెక్టర్‌కు నివేదిక అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిబంధనలకు మించి సిజేరియన్‌ ఆపరేషన్‌లు చేసే ఆసుపత్రులపైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి సగటు కంటే ఎక్కువ

జిల్లాలో రాష్ట్రస్థాయి సగటు కంటే ఎక్కువగా సిజేరియన్‌లు జరుగుతున్నా యి. గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసే అవకాశం ఉన్నా.. అంతకుమించి ఎ క్కువగా ప్రసవాలను సిజేరియన్‌ ద్వారా చేస్తున్నారు. సాధారణ ప్రసవాలకన్న సిజేరియన్‌ చేసిన వారికి కొన్ని సంవత్సరాల తర్వాత ఇతర సమస్యలు ఎదురవుతుండడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర వైద్య సంస్థలు ఆంధోళన వ్యక్తం చేశాయి. జిల్లాలో సిజేరియన్‌లు తగ్గించాలని కోరాయి. రాష్ట్రస్థాయిలో సిజేరియన్‌లు 50 శాతంలోపు ఉండగా.. జిల్లాలో మాత్రం 75శాతం వరకు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని సాధారణ ప్రసవాలు జరుగుతున్నా.. ప్రైవేట్‌ ఆసు పత్రుల్లో మాత్రం ఎక్కువగా సిజేరియన్‌లు జరుగుతున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 92 శాతానికి పైగా సిజేరియన్‌లు కొనసాగుతున్నాయి. ఈ ఆసుపత్రుల్లో ప్రసవాల కోసం వచ్చే వారికి ప్యాకేజీల పేరుమీద చికిత్స అందిస్తున్నారు. ప్రసవాలు చేస్తున్నా రు. ప్రతీ ప్రసవానికి రూ.40 నుంచి 70వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. ఇవేకాకుండా మందులు, ఇతర వస్తువులకు ఎ క్కువగా డబ్బులను వసూలు చేస్తున్నా రు. జిల్లాలోని ఎక్కుశాతం ప్రైవేట్‌ ఆ సుపత్రులకు వచ్చేవారికి సాధారణ ప్ర సవాలు చేస్తే బిల్లు రూ.20వేల లోపే అవుతుండడంతో ఎక్కువ డబ్బులు సిజేరియన్‌ల ద్వారా వస్తుండడంతో వాటి ని ఎక్కువగా చేస్తున్నారు. గ్రామీణ ప్రాం తంలో ఆర్‌ఎంపీల ద్వారా మార్కెటింగ్‌ నిర్వహి స్తూ తమ ఆసుపత్రులకు గర్భిణులు  వచ్చేవిధంగా చూసుకుంటున్నారు. తమ ఆసుపత్రులకు వచ్చిన గర్భిణులకు ప్రసవాలు చేసిన తర్వాత, మొత్తం అయ్యే బిల్లులో 10 నుంచి 15శాతం వరకు గ్రామీణ వైద్యులకు కొంతమందికి ఇస్తున్నారు. వారి ద్వారానే ఎక్కువగా ఈ కేసులు వచ్చేవిధంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు చూసుకుంటున్నారు. వీరేకాకుం డా కొన్ని ఆసుపత్రులు సొంతగా మార్కెంగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాం తంలో ఉన్న కొంతమంది ఆశ వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా గర్భీణుల వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌లు చేస్తూ తమ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చేవిధంగా చేసుకుంటున్నారు. ప్యాకేజీల పేరుమీద బిల్లుల ను నిర్ణయించడంతో పాటు డబ్బులు వసూలు చేస్తున్నారు. సిజేరియన్‌ల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తుండడంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇవి ఎక్కువగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఈ సిజేరియన్‌లపైన గతంలో కూడా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జిల్లా పరిధిలో జరుగుతున్న సిజేరియన్‌లను ఆపాలని కోరింది. కొన్ని రోజులు సిజేరియన్‌లపై దృష్టిపెట్టడంతో తగ్గినా.. ఈ మధ్య మళ్లీ బాగానే పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జరిగే ప్రసవాల్లో 50శాతానికి పైగా సిజేరియన్‌లే జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నా.. కొంతమంది గర్భిణులు కూడా సిజేరియన్‌లవైపు మొగ్గుచూపడం, తిథులు, మంచి ముహుర్తాల పేరుమీద సిజేరియన్‌లను చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వసతులు, ఇతర పరికరాల పేరుమీద ఈ ప్యాకేజీలను నిర్వహిస్తూ ఈ సిజేరియన్‌లను ఎక్కువగా చేస్తున్నారు.

350కి పైగా ప్రైవేట్‌ ఆసుపత్రులు

జిల్లాలో సుమారు 350 పైగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, ల్యాబ్‌ లు ఉన్నాయి. వీటిపైన ప్రతీ సంవత్సరం కనీసం నాలుగుసార్లు అయినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. ఆ ఆసుపత్రుల్లో జరిగే చికిత్స వివరాలు పరిశీలించాలి. సాధారణ ప్రసవాలు, ఇతర వైద్య చికిత్సల వివరాలు పంపేవిధంగా చూసుకోవాలి. గడిచిన కొన్నేళ్లుగా జిల్లాలోని ఏ ఆసుపత్రి లో కూడా తనిఖీలు చేపట్టడంలేదు. ప్రతీ సంవత్సరం ఏదో ఒక ఆసుపత్రి మీద ఫిర్యాదు వస్తే కొన్నింటిలో పరిశీలించి వదిలేస్తున్నారు. ప్రతీ ఆసుపత్రిలో జరిగే ప్రసవాలు, ఇతర చికిత్సల వివరలను రికార్డు చేయాలి. ప్రసవాల వివరాలన్నీ ప్రతీనెలా వైద్య ఆరోగ్యశాఖకు పంపించాలి. వీటిలో సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌ల వివరాలు ఇవ్వాలి. సిజేరియనల్‌లు ఎందుకు చేశారో? కారణాలు కూడా అందులో పొందుపర్చాలి. ఇవేకాకుండా ఆసుపత్రిల్లో జరిగే జననాలు, మరణాల వివరాలు కూడా పంపించాలి. ప్రతీ ఆసుపత్రిలో ఏయే చికిత్సకు ఎంత డబ్బు లను తీసుకుంటున్నారో? ఆ వివరాలు బోర్డుపైన పొందుపర్చాలి. ఏ ఆసుపత్రుల్లోనూ తనిఖీలు చేపట్టకపోవడం వల్ల.. కొన్ని ఆసుపత్రులు మినహా మిగతా ఆసుపత్రుల్లో చార్జీలకు సంబంధించిన వివరాలను పొందుపర్చడం లేదు. బోర్డుపైన నోటిఫై చేయడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ లు చేపట్టకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో స్నెషలిస్టు డాక్టర్‌లు ఉన్నారని చెప్పి సాధారణ వైద్యులతోనే చికిత్సలు చేస్తున్నారు. ప్రత్యేక వైద్యుల పేరున బిల్లులు తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నెలా వారి మామూళ్లు అందడం వల్ల ఆ వైపు చూడడంలేదు. కరొనా సమయం లో కూడా ఈ ఆసుపత్రులపై ఎన్నో ఆరోపణలు వచ్చిన పట్టించుకోలేదు.

అటువైపుగా చూడని అధికారులు

కాగా, వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్‌ వైద్యులవే ఎక్కువగా ఈ ఆసుపత్రులు ఉండడం వల్ల అధికారులు ఆ వైపు వెళ్లడంలేదు. దీనిలో భాగంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జిల్లాలో ఈ సిజేరియన్‌ ప్రసవాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. వీటిపైన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేయడం వల్ల కలెక్టర్‌ నారాయణరెడ్డి వీటిపై సమీక్షింంచారు. ఇందుకు గానూ తనిఖీల కోసం అధికారుల బృందాలను సైతం నియమించారు. ఈ బృందాల్లో జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం, డీపీవో జయసుధ, ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్‌తో పాటు ప్రొగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అంజన, పలువురు అధికారులను నియమించారు. వీరి ఆధ్వర్యంలోనే వారంపాటు తనిఖీలు చేయనున్నారు. ఈ తనిఖిల్లో భాగంగా ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ఆసుపత్రులపైన చర్యలు చేపట్టనున్నారో తేలే అవకాశం ఉంది. జిల్లాలోని 85 ఆసుపత్రులలో జరుగుతున్న సిజేరియన్‌లపైన తనిఖీలు చేసేందుకు ఎనిమిది బృందాలను నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఈ బృందాలు తనిఖీలు చేసి కలెక్టర్‌కు నివేదిక అందిస్తాయని ఆయన తెలిపారు. ఈ నివేదిక ఆఽధారంగా ఆసుపత్రులపై చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో సాదారణ ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-06-26T06:30:39+05:30 IST