Abn logo
Sep 26 2020 @ 13:24PM

ప్రియుడి బర్త్‌డే‌కు నయన్ రూ.25 లక్షల ఖర్చు?

Kaakateeya

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుని అత్యంత పారితోషికం అందుకుంటోంది హీరోయిన్ నయనతార. కొద్ది రోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో కలిసి నయన్ గోవా ట్రిప్‌నకు వెళ్లింది. 


మూడు రోజుల పాటు గోవాలోనే ఉండి విఘ్నేష్ బర్త్‌డేను కూడా అక్కడే సెలబ్రేట్ చేసింది. ఈ మూడు రోజుల ట్రిప్ కోసం నయన్ ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయన్, విఘ్నేష్ నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కెరీర్‌లో అనుకున్నవి సాధించాకనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ వెల్లడించాడు. 

Advertisement
Advertisement
Advertisement