Abn logo
Feb 25 2021 @ 16:48PM

నయనతార పెళ్లి ఎప్పుడంటే..

కోలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లో అగ్రహీరోయిన్‌గా ఉన్న నయనతార ఇటీవలి కాలంలో బిజీబిజీగా గడుపుతోంది. పలు సినిమాలు నిర్మించడం, మరికొన్ని సినిమాలు కొనుగోలు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్‌ చేసే పనుల్లో కూడా నిమగ్నమైవుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న నయనతార... సోలో హీరోయిన్‌గా వచ్చే చిత్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే మార్చి నెలలో తన ప్రియుడితో కలిసి నయనతార పెళ్ళిపీటలెక్కనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలపై ఈ మలయాళ బ్యూటీ డైరెక్టుగా స్పందించడం లేదు. కానీ, ఆమె సన్నిహిత వర్గాల సమాచారం మేరకు నయనతార వచ్చే యేడాదిలో పెళ్ళి చేసుకుని ఇంటికే పరిమితంకావాలన్న ఆలోచనలో వుందట. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలను ఈ యేడాది ఆఖరునాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో వుంది. అదేసమయంలో తన కాబోయే భర్తతో కలిసి కొన్ని సినిమాలు నిర్మిస్తూ, సినిమా డిస్ట్రిబ్యూటర్‌గాను కొనసాగాలన్న బలమైన పట్టుదలతో నయనతార ఉన్నట్టు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement