‘ఫోర్బ్స్‌’ కవర్ పేజీపై నయనతార

ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్‌గా గుర్తింపు పొందిన ‘ఫోర్బ్స్‌’ పత్రిక.. కవర్‌ పేజీపై లేడీ సూపర్‌స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఫొటోను ప్రచురించింది. సాధారణంగా ఈ పత్రిక మేగజైన్‌ కవర్‌ పేజీపై ఫొటో ప్రచురితం కావాలంటే అంత ఆషామాషీ కాదు. కానీ, దక్షిణ భారతదేశంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రసీమల్లో నయనతార నటిస్తున్నారు. దీంతో ‘ఫోర్బ్స్‌’ పత్రిక ఆమె ఫొటోను సౌత్‌ సెలెబ్రిటీ స్పెషల్‌ కింద ప్రచురించింది. ఈ కవర్ పేజీని ‘ఫోర్బ్స్‌’ సంస్థ అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్‌ చేసింది. ఈ కవర్ పేజీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Advertisement