Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 24 May 2022 13:47:46 IST

వళుత్తియూరు ఆలయంలో Nayanathara - Vighnesh Shivan ప్రత్యేక పూజలు

twitter-iconwatsapp-iconfb-icon
వళుత్తియూరు ఆలయంలో Nayanathara - Vighnesh Shivan ప్రత్యేక పూజలు

కోలీవుడ్‌ ప్రేమజంట Nayanathara, Vighnesh Shivan లు వచ్చేనెల్లో పెళ్ళిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట  తమ పెళ్ళి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో ఆ భాగంగా ఆ ఇద్దరూ తమ వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని పలు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవలే తిరుమల వెళ్ళి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తిరుచ్చి  జిల్లాలోని తమ కులదైవం ఆలయానికి వెళ్ళారు. చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లిన వీరిద్దరూ అక్కడ నుంచి తంజావూరు జిల్లా అయ్యంపేట వళుత్తియూరికి వెళ్ళి అక్కడ ఉన్న కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి దర్శనం చేసుకున్నారు. 


ఈ సందర్భంగా వారు తమ మొక్కును తీర్చుకుని, తొలి పెళ్ళి పత్రికను తమ కులదైవం పాదాల చెంత పెట్టినట్టుట్లు సమాచారం. వీరిద్దరి వివాహ ముహూర్తం జూన్‌ నెల 9వ తేదీకి ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల నయనతార (Nayanathara ) తన ప్రియుడి దర్శకత్వంలో ‘కాత్కువాకుల రెండు కాదల్’  (Kathuvakkula rendu kathaql) చిత్రంలో నటించగా.. కోలీవుడ్‌లో దానికి మంరి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ,  సమంత (Samantha) ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తన కెరీర్ లోనే ప్రత్యేకమైనది భావిస్తున్నట్టు నయన్ చెప్పింది. కాగా నయన్ ప్రస్తుతం తన పెళ్ళి కారణంగా ఏ సినిమాలోనూ నటించడం లేదు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement