Jun 30 2021 @ 01:54AM

నయనతార ‘ఎస్‌’ అనలేదు

దక్షిణాది కథానాయిక నయనతార త్వరలోనే బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌తో ఓ చిత్రం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఇప్పటికే నయనతార అట్లీకి ‘ఎస్‌’ చెప్పారని ఊహించడం ముందే తొందరపడడం అవుతుందంటున్నారు. ‘‘బాలీవుడ్‌లో సినిమా చేసేందుకు నయనతార తొందరపడడం లేదు. సినిమా కథ, అందులో తన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకుండా ఆమె ఏ సినిమా అంగీకరించరు. షారూఖ్‌ తో అట్లీ చేయబోయే చిత్రానికి కథ పూర్తిగా సిద్ధమవలేదు. కథపై కసరత్తు చేస్తున్నారు. ముందు స్ర్కిప్ట్‌పూర్తవ్వాలి. అది నయనతారకు నచ్చాలి. అప్పుడు మాత్రమే ఆమె ఆ సినిమాలో నటిస్తున్నారా? లేదా? అనేది తెలుస్తుంది. అప్పటిదాకా ఇవన్నీ వదంతులే’’ అని తమిళ సినీవర్గాలు చెపుతున్నాయి. అయితే అట్లీ షారూఖ్‌తో చేయబోయేది తమిళ చిత్రం రీమేక్‌ కాదట. కొత్త కథతో అట్లీ సిద్ధమవుతున్నారు అని వారు చెపుతున్నారు. 


Bollywoodమరిన్ని...