Abn logo
Feb 21 2020 @ 20:09PM

నయన‌తారపై సీరియస్... ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా?

హీరోయిన్ నయనతారపై తమిళ నిర్మాతల మండలి సీరియస్‌గా ఉందట. తమిళనాడులో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నయన.. షూటింగ్ సమయంలో అయ్యే ఖర్చులు కూడా ఎక్కువేనట. నయన రెమ్యూనరేషన్‌తో పని లేకుండా రోజుకు రూ. 60 వేల నుంచి దాదాపు లక్ష వరకు అవుతుందట. ఈ సొమ్మును కూడా నిర్మాతల ఖాతాలో వేస్తోందట. షూటింగ్ సమయంలో ఆమెను కలిసేందుకు వచ్చిన ప్రియుడి ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలట. దీంతో నయనను తట్టుకోవడం నిర్మాతలకు చాలా కష్టంగా మారిందట. నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారట. షూటింగ్ సమయంలో ఆమెకు అయ్యే ఇతర ఖర్చులను కూడా రెమ్యూనరేషన్‌లోనే జమ చేయాలనే డిమాండ్‌ను కూడా నిర్మాతలు తీసుకొస్తున్నారట. మరి నయనతార స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement