Jul 27 2021 @ 14:48PM

Nayanatara: విఘ్నేశ్‌తో నయనతార.. సైలెంట్‌గా షురూ చేసేసింది

న‌య‌న‌తార‌, డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్ ప్రేమ‌లో ఉన్నారు. త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు వినిపిస్తోన్న నేప‌థ్యంలో వీరిద్ద‌రూ సైలెంట్‌గా ఏం స్టార్ట్ చేశార‌నే సందేహం రాక మాన‌దు. వివ‌రాల్లోకెళ్తే.. న‌య‌న‌తార మ‌రో థ్రిల్ల‌ర్ సినిమాకు ఓకే చెప్పింది. ఈ చిత్రాన్ని విఘ్నేశ్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఈ విఘ్నేశ్, న‌య‌న‌తార‌ ప్రియుడు విఘ్నేశ్ శివ‌న్ కాదు.. వెంకట్‌ ప్రభు వద్ద సహాయ దర్శకుడుగా పనిచేసిన జి.ఎస్‌.విఘ్నేష్‌.   రీసెంట్‌గా ఈయ‌న న‌య‌న‌ను క‌లిసి క‌థ చెప్ప‌గా, ఆమెకు బాగా న‌చ్చేసింది. వెంట‌నే కాల్షీట్స్ కేటాయించింది. ఇప్పటికే ‘మాయా’, ‘డోరా’, ‘ఐరా’, ‘నెట్రికణ్‌’ వంటి థ్రిల్లర్‌ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మ‌రో థ్రిల్ల‌ర్‌కు ఓకే చెప్ప‌డ‌మే కాదు..పనిలోపనిగా గుట్టుచప్పుడు కాకుండా తొలి షెడ్యూల్‌ను చెన్నై నగరంలో ప్రారంభించారు. రెండో షెడ్యూల్‌ను కోయంబత్తూరులో ప్రారంభించేలా ప్లాన్‌ చేశారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీకి తమిళ్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తుంటే, రాన్‌ ఈదన్‌ యోహన్‌ సంగీతం సమకూర్చుతున్నారు.