Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూ లుక్‌లో నయన్‌!

తెల్ల చీర, కొప్పులో మల్లెపూలు... నయనతార అందాలను రెట్టింపు చేశాయి. మలయాళ కొత్త సంవత్సరం విషు సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో నయనతార కనిపించారు. కొత్తలుక్‌లో నయనతార దిగిన ఫొటోలను విషు క్లిక్స్‌ పేరుతో ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా వైరలయ్యాయి. విషు పండుగను సెలబ్రేట్‌ చేసుకోవటానికి ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలసి ఆమె కేరళ వెళ్లారు. ప్రస్తుతం ఆమె తమిళంలో రజనీకాంత్‌ సరసన ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఆమె ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గోనున్నారు. 

Advertisement
Advertisement