Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 24 Apr 2022 19:59:13 IST

నా ఇంటి విలువను మీరు ఊహించలేరు: నవాజుద్దీన్ సిద్దిఖీ

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌లోని విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. కొన్ని రోజుల క్రితం నవాజ్ ముంబైలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. తన తండ్రికి గుర్తుగా ఆ ఇంటికి నవాబ్ అని పేరు పెట్టాడు. చాల చిత్రాల్లో నటిస్తే వచ్చిన డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించుకున్నానని అతడు తెలిపాడు. ఆ ఇంటి విలువను ఊహించలేరని చెప్పాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. 


తాను నాలుగు, ఐదు సక్సెస్‌ఫుల్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తే వచ్చిన డబ్బుతో ముంబై మహానగరంలో భవంతిని కట్టలేదని నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పాడు. ఎన్నో రోజులుగా బాలీవుడ్‌లో నటుడిగా కొనసాగుతున్నానని పేర్కొన్న నవాజుద్దీన్... తన సుదీర్ఘ కెరీర్ వల్లే స్వంతింటి కల సాకారమైందని తెలిపాడు. అంతే కాదు, తన ఇంటి విలువను ఎవరూ ఊహించలేరని అతడు వ్యాఖ్యానించాడు. 


కమర్షియల్ సినిమాల గురించి కూడా తన అభిప్రాయం చెప్పాడు సిద్ధీఖీ. ప్రజల్ని ఏకతాటిపై నడిపించేవే కమర్షియల్ సినిమాలంటూ నిర్వచించాడు. ‘బజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలు ఈ కేటగీరీ కిందకు వస్తాయని చెప్పాడు. ప్రజలను విడగొట్టేవి అసలు సినిమాలే కాదని వెల్లడించాడు. కాకపోతే, ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతోన్న సినిమాలతో తాను అసంతృప్తిగా ఉన్నానని మాత్రం స్పష్టం చేశాడు. కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచులు మారుతాయని అనుకున్నానని వెల్లడించాడు. కానీ, నేడు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్న చిత్రాలతో వారి అభిరుచి ఏ మాత్రం మారలేదనే విషయం అర్థమైందన్నాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement