Aug 1 2021 @ 19:25PM

నెటిజన్‌ ప్రశ్న.. బిగ్‌బీ మనవరాలు జవాబు

గ్లామర్‌గా ఉన్న అమ్మాయిలు మోడలింగ్‌, సినీరంగంలోనే కాదు వ్యాపారరంగంలోనూ సక్సెస్‌ కాగలరు అంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు నవ్య. తాజాగా ఓ అందమైన ఫొటో షేర్‌ చేశారామె! దానికి ఓ నెటిజన్‌ ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ప్రయత్నం చేయండి’ అని అడిగాడు. అందుకు నవ్య ‘మీ అభిమానానికి థ్యాంక్స్‌. అందమైన మహిళలు బిజినెస్‌లోనూ రాణించగలరు’ అని సమాధానమిచ్చారు. ఆమె సమాధానికి బిగ్‌బీ నవ్యను ప్రశంసించారు. ‘ఆరా హెల్త్‌’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించిన ఆమె ఆరోగ్యం, పరిశుభ్రత విషయాల్లో మహిళలకు సహకరిస్తుంది. వారసత్వం ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలోకి రావడం పట్ల ఆసక్తి లేదని నవ్య స్పష్టం చేసింది.