వేడుకగా నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-01T07:48:56+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.

వేడుకగా నవరాత్రి ఉత్సవాలు
అన్నపూర్ణ అలంకారంలో సూళ్లూరుపేట చెంగాళమ్మ- ధనలక్ష్మి అలంకారంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ

సూళ్లూరుపేట, సెప్టెంబరు 30: సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.ఉదయం అమ్మవారికి విశేష పూజలతోపాటు అభిషేకం చేశారు. అనంతరం యాగశాల మండపంలో మహాచండీయాగాన్ని ఆలయ పాలక మండలి  అధ్యక్షుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీవీధి, పార్కువీధి,  గాండ్లవీధి,  కచ్చేరివీధివాసులు అమ్మవారికి సారె సమర్పించారు.పాండురంగస్వామి గుడివద్ద నుంచి సారెను సాంప్రదాయబద్దంగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. తిరుపతి కొత్తవీధిలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తికి రూ. 50లక్షల విలువచేసే కరెన్సీ నోట్లతో విశేష అలంకరణ చేపట్టారు. 





Updated Date - 2022-10-01T07:48:56+05:30 IST