జిల్లాలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-14T06:31:20+05:30 IST

జిల్లాలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని దుర్గాదేవికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు విశేష పుష్పార్చన, నైవేద్యాలు సమర్పించారు. బుధవారం దుర్గాష్టమి కావడంతో ఆలయాలు, మంటపాల్లో విశేష కుంకుమార్చనలతో పాటు దుర్గాసప్తశతహోమాలు, అన్నదానాలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గాదేవి రూపంలో

జిల్లాలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
నగరంలో చండీహోమం చేస్తున్న భక్తులు

దుర్గాదేవికి భక్తుల ప్రత్యేక పూజలు
ఏడో రోజు దుర్గా రూపంలో అమ్మ దర్శనం
జోరుగా హోమాలు, అన్నదానాలు

నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబరు 13: జిల్లాలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని దుర్గాదేవికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు విశేష పుష్పార్చన, నైవేద్యాలు సమర్పించారు. బుధవారం దుర్గాష్టమి కావడంతో ఆలయాలు, మంటపాల్లో విశేష కుంకుమార్చనలతో పాటు దుర్గాసప్తశతహోమాలు, అన్నదానాలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అలంకరిం చారు. కాగా. గురువారం  కాత్యాయనీ (అన్నపూర్ణదేవి) రూపంలో దుర్గావేవి దర్శనమివ్వనున్నారు. ప్రసాదంగా పొంగలి సమర్పించాలి.
నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని 18వ డివిజన్‌ పరిధిలోని ముబారక్‌నగర్‌లో గల పెద్దమ్మతల్లి ఆలయంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, మనీషా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 

Updated Date - 2021-10-14T06:31:20+05:30 IST