నవరత్నాల పేరుతో అప్పుల ఊబిలోకి

ABN , First Publish Date - 2022-05-18T04:51:40+05:30 IST

వైసీపీ నవ రత్నాల పథకాలతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ అన్నా రు.

నవరత్నాల పేరుతో అప్పుల ఊబిలోకి

సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ

సీఎస్‌పురం, మే 17 : వైసీపీ నవ రత్నాల పథకాలతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ అన్నా రు. మంగళవారం మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమా వేశంలో ఆయన మాట్లాడారు. కేం ద్రంలో మోదీ, ఇక్కడ జగన్‌రెడ్డి పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచి ఇబ్బం దులకు గురిచేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. కరెంట్‌, బస్సు చార్జీలు, ఆస్తి, చెత్త పన్నులు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు. జూన్‌లో సీఎస్‌ పురంలో నియోజకవర్గ మహాసభలు, జూలైలో కనిగిరిలో జరిగే జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని నారాయణ కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్‌డీ మౌలాలి, పామూరు మండల సహాయ కార్య దర్శి వజ్రాల సుబ్బారావు, మండల కార్యదర్శి ఎస్‌కేవై పెదమస్తాన్‌, ఏఐటీ యూసీ కార్యదర్శి పి.మస్తాన్‌రావు  పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-18T04:51:40+05:30 IST