Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 23 Jan 2022 15:13:15 IST

దురదపుడితే గోక్కుంటాం కానీ, తోలు పీకేసుకోం కదా : నవదీప్

twitter-iconwatsapp-iconfb-icon
దురదపుడితే గోక్కుంటాం కానీ, తోలు పీకేసుకోం కదా : నవదీప్

కొంత కాలంగా నవదీప్ హీరో వేషాలు మానేసి.. ప్రధాన పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ మూవీలోనూ నవదీప్ ముఖ్యపాత్రలు పోషించాడు. ప్రస్తుతం సన్నీలియోన్ కథానాయికగా నటిస్తోన్న ‘వీరమాదేవి’ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాడు.  17 ఏళ్ళ క్రితమే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. ఇప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకుండా టాలీవుడ్ బ్యాచులర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. గెడ్డం నెరిసిపోవడంతో  సోషల్ మీడియాలో అతడిపై ట్రోల్స్ చేస్తున్నారు. 


వాటిపై నవదీప్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సెటైరికల్ గా స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. వద్దురా సోదరా అనే హెడ్డింగ్ పెట్టి..  ‘అన్నా నీ గెడ్డం తెల్లబడుతోంది. తొందరగా పెళ్ళి చేసుకోమని నాకు సలహాలిస్తున్నారు. గెడ్డం తెల్లబడితే చేసుకోవల్సింది ట్రిమ్మింగ్ కానీ,  పెళ్ళి కాదు. దురదపుడితే గోక్కుంటాం కానీ, తోలుపీకేసుకోం కదా అలాగే ’ అంటూ తన పెళ్ళిపై తనే సెటైర్స్ వేసుకున్నారు. నవదీప్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement