నవ నలంద మహావిహార వర్సిటీలో Academic Programs

ABN , First Publish Date - 2022-06-18T21:07:59+05:30 IST

బిహార్‌లోని నవ నలంద మహావిహార యూనివర్సిటీ(Nava Nalanda Mahavihara Uniarsity ) - పలు అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌(Notification‌) విడుదల చేసింది. పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. పీజీలో ప్రవేశానికి జనరల్‌ ఆన్‌లైన్‌

నవ నలంద మహావిహార వర్సిటీలో  Academic Programs

బిహార్‌లోని నవ నలంద మహావిహార యూనివర్సిటీ(Nava Nalanda Mahavihara Uniarsity ) - పలు అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌(Notification‌) విడుదల చేసింది. పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. పీజీలో ప్రవేశానికి జనరల్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రోగ్రామ్‌లలో అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. 


ఎంఏ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి స్పెషలైజేషన్‌లో 40 సీట్లు ఉన్నాయి.

స్పెషలైజేషన్‌లు: పాళీ, ఫిలాసఫీ, ఏన్షియంట్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, హిందీ, ఇంగ్లీష్‌, సంస్కృతం, బుద్దిస్ట్‌ స్టడీస్‌, టిబెటన్‌ స్టడీస్‌ 

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

బీఏ: ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. స్పెషలైజేషన్‌ పాళీ(ఆనర్స్‌). ఈ ప్రోగ్రామ్‌లో 40 సీట్లు ఉన్నాయి. 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 

పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో స్పెషలైజేషన్‌లో 40 సీట్లు ఉన్నాయి. 

స్పెషలైజేషన్‌లు: యోగ, బుద్దిస్ట్‌ హెరిటేజ్‌ - టూరిజం

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఒక్కో స్పెషలైజేషన్‌లో 40 సీట్లు ఉన్నాయి. 

స్పెషలైజేషన్‌లు: పాళీ,టిబెటన్‌ స్టడీస్‌, చైనీస్‌

అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్టులో సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణులైనవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

సర్టిఫికెట్‌ కోర్సు: ప్రోగ్రామ్‌ వ్యవధి  ఏడాది. ఒక్కో స్పెషలైజేషన్‌లో 40 సీట్లు ఉన్నాయి. 

స్పెషలైజేషన్‌లు: పాళీ, టిబెటన్‌ స్టడీస్‌, చైనీస్‌, జపనీస్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్‌

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ౌ


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500 

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 8

అడ్మిట్‌ కార్డ్‌ విడుదల: జూలై 14

పీజీ అడ్మిషన్‌కు ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: జూలై 20

ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల: జూలై 28న

అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌: ఆగస్టు 3 నుంచి 16 వరకు

వెబ్‌సైట్‌: nnm.ac.in

Updated Date - 2022-06-18T21:07:59+05:30 IST