ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2020-06-07T09:29:01+05:30 IST

తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా), జిజ్ఞాస, జయహో భారతీయం సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జూమ్‌ ద్వారా

ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

  • తానా ‘పర్యావరణ-పరిరక్షణ’ దినోత్సవం ప్రారంభం


విజయవాడ కల్చరల్‌, జూన్‌ 6: తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా), జిజ్ఞాస, జయహో భారతీయం సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జూమ్‌ ద్వారా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పర్యావరణ పరిరక్షణలో తానా చొర వ అభినందనీయమన్నారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మనిషి దాని పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని ఆమె సూచించారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ నేటి ఆధునిక సమాజంలో తప్పనిసరి బాధ్యత అని, ‘‘ఉమ్మడి లక్ష్యం - ఉమ్మడి బాధ్యత’’ స్ఫూర్తితో ప్రపంచ దేశాల్లో ని ఎవరైనా ఈ ఉత్సవంలో పాల్గొని సలహాలు, సూచనలు అందించి పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించేందుకు భాగస్వామ్యులు కావాలని కోరారు. ‘‘టైం ఫర్‌ నేచర్‌ సెలబ్రేట్‌ అండ్‌ ప్రొటెక్ట్‌ బయోడైవర్సిటి’’ నినాదంతో  ఉత్సవాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాసలో భారతీయ ప్రతినిధి రాజా కార్తికేయ, అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు రాజా కృష్ణమూర్తి, ఉత్సవ సమన్వయకర్త తూనుగుంట్ల శిరీష, జయహో భారతీయం అధ్యక్షులు శ్రీనివాస్‌, జిజ్ఞాస చైర్మన్‌ భార్గవ్‌, తానా కార్యదర్శి పొట్లూరి రవి, తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్‌ చైర్మన్‌ శృంగవరపు నిరంజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T09:29:01+05:30 IST