ప్రకృతి సంపదను పెంపొందించాలి

ABN , First Publish Date - 2021-07-25T05:13:01+05:30 IST

ప్రకృతి సంపద పెంపొందించుకోవడంతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

ప్రకృతి సంపదను పెంపొందించాలి
తుర్కపల్లి : వాసాలమర్రిలో మొక్క నాటుతున్న ప్రభుత్వ విప్‌ సునీత

 ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి
జిల్లావ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు
ఊరూరా మొక్కలు నాటిన నాయకులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 24 :
ప్రకృతి సంపద పెంపొందించుకోవడంతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కోటి వృక్షార్చనలో భాగంగా ఊరూరా మొక్కలు నాటారు. ఆలేరు మండలంలోని శారాజీపేట, యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్‌పేట, తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామాల్లో ప్ర భుత్వ విప్‌ సునీత మొక్కలు నాటి మాట్లాడారు. భువనగిరి పట్టణం, భువనగిరి మండలం హన్మాపురం, పోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పుర్‌ గ్రామశివారులోని అర్బన ఫారెస్టు, బీబీనగర్‌ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మొక్కలు నాటి మాట్లాడారు. బొమ్మలరామారం మండల కేంద్రంతో పాటు నాగి నేనిపల్లి, మేడిపల్లి, ఫకీర్‌గూడెం గ్రామాల్లో జడ్పీ చై ర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి మొక్కలు నాటారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా చౌటుప్పల్‌ మునిసిపాలిటీ ఏడో వార్డుకు చెందిన ఫ్లోరైడ్‌ బాధితులు సంధ్య, రేణుకు డీసీసీ మాజీ డైరెక్టర్‌ పిల్లలమర్రి శ్రీనివాస్‌ రూ.10వేల ఆర్థిక సా యం అందించారు. చౌటుప్పల్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు, ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివా్‌సరెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. వ్యవసాయ మార్కె ట్‌ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసిన అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వలిగొండ మండలంలోని శ్రీ మ త్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలోని జగ్జీవనరామ్‌ చౌరస్తా, అనాజిపురంలో రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన కంచర్ల రామకృష్ణారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి కేక్‌ కట్‌ చేయడంతో పాటు మొక్కలు నాటారు. అడ్డగూడూ రు మండలంలోని ధర్మారం గ్రామంలోని స్వగృహంలో రాష్ట్ర గిడ్డంగుల కా ర్పొరేషన మాజీ చైర్మన సామేల్‌ కేక్‌ కట్‌ చేశారు. గుండాల, అడ్డగూడూరు, యాదగిరిగుట్ట, ఆలేరు, రామన్నపేట, రాజాపేట, ఆత్మకూర్‌(ఎం) మండలాల్లో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2021-07-25T05:13:01+05:30 IST