Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అల్లంతో లాభాలెన్నో...!

twitter-iconwatsapp-iconfb-icon
అల్లంతో లాభాలెన్నో...!

మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన న్యాచురల్‌ రెమిడీ అల్లం. మనదేశంలో దొరికే ట్రెడిషనల్‌ మెడిసిన్‌ ఇదే. 


  • ఇది పసుపు జాతికి చెందినది. అప్పుడే మట్టిలోంచి తీసిన అల్లం దుంపలో 79 శాతం నీళ్లు, 18శాతం కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు అల్లం టీ తాగుతుంటారు. అప్పుడు చక్కని ఉపశమనం కలుగుతుంది. 
  • రక్తంలోని చక్కెర శాతాన్ని అల్లం తగ్గిస్తుంది. కొలెస్ర్టాల్‌ను తగ్గించే గుణం దీనికి ఉంది. దీనివల్ల గుండెసమస్యలు రావు.
  • మినరల్స్‌,  బి3,బి6, సి-విటమిన్‌, పాస్ఫరస్‌, జింక్‌, పొటాషియం, ఐరన్‌.. ఇలా 400కి పైగా ఉపయోగకరమైన కాంపౌండ్స్‌ అల్లంలో ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని కండరాల నొప్పిని అల్లం తగ్గిస్తుంది. కీళ్లనొప్పుల సమస్యను తగ్గించటానికి ఇది ఉపయోగపడుతుంది.
  • నోటిలో ఉండే బ్యాక్టీరియా, వైర్‌సలను తరిమికొట్టే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా వాంతులను నివారించే గుణం అల్లంకు ఉంది. ఈ విషయం కొన్ని పరిశోధనల్లో తేలింది. జీర్ణం సాఫీగా జరుగుతుంది. అలాగని రోజూ తీసుకుంటే మాత్రం ఇబ్బందే.. కడుపులో మంట పుడుతుంది. 
  • ఆస్తమాను కంట్రోల్‌ చేయగలదు. మొత్తానికి వ్యాధి నిరోధక శక్తిని అల్లం పెంచుతుంది.
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.