ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు

ABN , First Publish Date - 2022-08-18T05:39:43+05:30 IST

ప్రకృతి వ్యవసాయం విధానంలో ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని సేంద్రియ వ్యవసాయ పాలకొల్లు డివిజన్‌ ఇన్‌చార్జి పి.అప్పారావు అన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు

యలమంచిలి, ఆగస్టు 17: ప్రకృతి వ్యవసాయం విధానంలో ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని సేంద్రియ వ్యవసాయ పాలకొల్లు డివిజన్‌ ఇన్‌చార్జి పి.అప్పారావు అన్నారు. మండలంలోని కాంబొట్లపాలెంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానంపై బుధవారం శిక్షణ ఇచ్చారు. సూర్య మండలం ఆకృతిలో కేవలం మూడు సెంట్లస్థలంలో ఏడు రకాల పంటలు, కూరగాయలు పండించవచ్చని తెలిపారు. రైతులకు సూర్యమండలం ఆకృతి లో సాగు విధానాన్ని వివరించారు. ద్రవ జీవామృతం తయారీ, వినియో గించే విధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనిశెట్టి మల్లిక, పి.ఆంజనేయులు, జడ్డు బదరినారాయణ, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:39:43+05:30 IST