Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరోగ్యవంతమైన చర్మానికి వేప, తులసి, పసుపు చేసే మేలేంటో తెలిస్తే..!

ఆంధ్రజ్యోతి(29-12-2021)

చర్మ సౌందర్యానికి రసాయనాలతో చేసిన ఉత్పత్తుల కంటే మెరుగైన ఫలితాలనిచ్చే సహజసిద్ధమైన వనరులెన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో వేప, తులసి, పసుపు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 


వేప: ఇందులో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌, యాంటీవైరల్‌ లక్షణాలు పుష్కలం. చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడంలో వేప ఆకు బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై మంట తగ్గిస్తుంది. వేప కలిపిన నీటితో స్నానం చేస్తే ఎన్నో చర్మ వ్యాధులను దూరంగా పెట్టచ్చు. 


పసుపు: మన వంటింట్లో అనాదిగా ఉపయోగిస్తున్న అద్భుత పదార్థం పసుపు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ కాంపోనెంట్స్‌ అధిక మొత్తంలో ఉంటాయి. మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలు, వృద్ధాప్యపు ఛాయలు, సొరియాసిస్‌ వంటి అనేక చర్మ సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. రోజూ వంటల్లోనే కాకుండా పాలల్లో కూడా పసుపు వేసుకొని తాగితే మంచి ఫలితాలుంటాయి. 


తులసి: ఇందులోని యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై నల్లమచ్చలు, మొటిమలు, ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో దోహదపడతాయి. తులసిలో విటమిన్‌ కె, యాంటీఆక్సిడెంట్స్‌ అధికం. ఇది రక్తప్రసరణను ప్రేరేపించి జుట్టు పెరగడానికి ఉపకరిస్తుంది.

Advertisement
Advertisement