టెంపా పోలీస్ డిపార్ట్మెంట్‌తో 'నాట్స్' లంచ్

ABN , First Publish Date - 2020-07-05T17:51:25+05:30 IST

అమెరికాలోని టెంపాబేలో కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీస్ వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

టెంపా పోలీస్ డిపార్ట్మెంట్‌తో 'నాట్స్' లంచ్

టెంపా బే: అమెరికాలోని టెంపాబేలో కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీస్ వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కరోనావైరస్ రోజురోజుకు విజృంభిస్తున్నందున, ఈ కఠినమైన సమయంలో నాట్స్... ఫ్రంట్ లైన్ హీరోలైన(కాప్స్‌) 50 మంది పోలీసుల కొరకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసింది. ఈ సంక్షోభ సమయంలో ధైర్యంగా పని చేస్తున్నందుకు, ప్రజలను సురక్షితంగా ఉంచినందుకు నాట్స్, పోలీస్ హీరోలకు అభినందనలు తెలియజేసింది. టెంపా బే చాప్టర్ కోవిడ్‌-19లో భాగంగా ఈ రోజు(జులై 3, శుక్ర‌వారం) మొత్తం షిఫ్ట్ కోసం హిల్స్‌బరో కౌంటీ డిస్ట్రిక్ట్ 2 షెరీఫ్ ఆఫీస్  కేప్టెన్ ఎరిక్ డి ఫెలిస్ చేతులమీదుగా 50 మందికి సరిపడా భోజనాలు అందజేసింది. నాట్స్ బోర్డు డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, టెంపా బే చాప్టర్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, స్థానిక రెస్టారెంట్ యజమాని నగేష్ నాయక్ మరియు పరిపాలనా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


డాక్టర్ రమ పిన్నమనేని, డాక్టర్ విజయ్ మరియు ఫణి దలై, సోమంచి కుటుంబం, డాక్టర్ పూర్ణ, తార బిక్కసాని, డాక్టర్ సుదర్శన్, రమా కామిశెట్టిలు ఈ ఆహార ఏర్పాట్లు చేశారు. నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ మాజీ చైర్మన్  శ్రీనివాస్ గుత్తికొండ, టాంపా బే కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, కార్యదర్శి సుధీర్ మిక్కిలినేని, సలహా చైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ సభ్యులు ఆరికట్ల ప్రసాద్, సతీష్ పాలకుర్తిలు పాల్గొన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ కృష్ణ  మేడిచర్లకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. టెంపాబే స్ఫూర్తితో మరిన్ని ఛాప్టర్లలో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.


Updated Date - 2020-07-05T17:51:25+05:30 IST