డల్లాస్‌లో పేదలకు ఆహారాన్ని పంపిణీ చేసిన నాట్స్

ABN , First Publish Date - 2020-05-30T02:01:11+05:30 IST

కరోనా వైరస్ అమెరికాలో కరోళ నృత్యం చేస్తున్న విసయం తెలిసిందే. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలుస్తున్న నాట్స్.. విపత్కర పరిస్థితుల్లో నిరాశ్రయు

డల్లాస్‌లో పేదలకు ఆహారాన్ని పంపిణీ చేసిన నాట్స్

డల్లాస్: కరోనా వైరస్ అమెరికాలో కరోళ నృత్యం చేస్తున్న విసయం తెలిసిందే. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలుస్తున్న నాట్స్.. విపత్కర పరిస్థితుల్లో నిరాశ్రయులైన వారికి తన వంతు సాయం చేస్తోంది. తాజాగా శాన్‌ఎంటానియో ప్రాంతంలోని సుమారు 100 మంది పేదలు, చిన్నారులకు నాట్స్.. ఆహారాన్ని పంపిణీ చేసింది. నాట్స్ యూత్ టీం సభ్యురాలైన సంజనా కలిదిండి.. ఆహార పంపిణీకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని చేశారు. కాగా.. సంజనా చేసిన సాయాన్ని నాట్స్ నాయకత్వం ప్రశంసించింది. ఇదిలా ఉంటే అమెరికాలో సుమారు 17.71లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. లక్ష మందికిపైగా కరోనా కాటుకు మృతి చెందారు. 


Updated Date - 2020-05-30T02:01:11+05:30 IST