కరోనాపై ముందుండి పోరాడే వారికి నాట్స్ ప్రోత్సాహం

ABN , First Publish Date - 2020-06-01T10:04:08+05:30 IST

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని

కరోనాపై ముందుండి పోరాడే వారికి నాట్స్ ప్రోత్సాహం

  • టెంపాబేలో ఆసుపత్రి సిబ్బందికి ఆహార పంపిణీ

టెంపాబే: ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. టెంపాబేలోని బ్రాన్‌డన్ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సిబ్బందితో పాటు పిల్లలకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వారిని ప్రోత్సాహించే ప్రయత్నం చేసింది. కరోనాపై యుద్ధంలో వైద్య సిబ్బందే అసలైన హిరోలు అని నాట్స్ అభివర్ణించింది. ప్రాణాలు తెగించి వారు చేస్తున్న సేవలను కొనియాడింది. నాట్స్ టెంపా సమన్వయకర్త రాజేశ్ కాండ్రు ఆధ్వర్యంలో  వైద్య సిబ్బందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన దాతలైన డా. రమ్య పిన్నమనేని, విజయ్, ఫణి దలై, సోమంచి ఫ్యామిలి, సుదర్శన్, రమ కామిశెట్టి, డా. పూర్ణ, తార బిక్కసానితో పాటు నాట్స్ కోర్ టీం నుంచి  శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, సుమంత్ రామినేని తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ఇలా వైద్య సిబ్బందిని ప్రోత్సహించడం పట్ల బ్రాన్‌డన్ వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. నాట్స్ సంస్థ ఎల్లపుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు వారికి అండగా ఉంటుందని తెలిపారు.

Updated Date - 2020-06-01T10:04:08+05:30 IST