పేదలకు అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం..!

ABN , First Publish Date - 2020-07-13T15:10:44+05:30 IST

అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేం

పేదలకు అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం..!

టెంపా:  అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తోంది. ఇందులో భాగంగా.. నాట్స్ టెంపా బే విభాగం నిత్యావసర సరుకులను పేదలకు అందించింది. అవేర్‌నెస్ యూఎస్‌తో కలిసి.. నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది. టెంపాబేలోని  బైబిల్ ట్రూత్ మినిస్టరీస్ అకాడమీ ప్యాలెస్ వద్ద నాట్స్ ఈ నిత్యాసవరాలను, ఆహారాన్ని పంపిణి చేసింది. నాట్స్ టెంపాబే నాయకులు  ప్రశాంత్ పిన్నమనేని, రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, సుమంత్ రామినేనితో పాటు  అవేర్‌నెస్ యూఏస్ఏ  ప్రతినిధులు, డాక్టర్ కె పిడియాట్రిక్స్ యజమాని రమా కామిశెట్టి, బటర్ ప్లై ఫార్మసీ యాజమానులు టోనీ, టుటు, తదితరులు ఈ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. రమ్య పిన్నమనేని, విజయ్, ఫణి దలయ్, సోమంచి కుటుంబం, డాక్టర్ పూర్ణ, తార బిక్కసాని, డాక్టర్ సుదర్శన్, రమా కామిశెట్టి, సుధీర్ మిక్కిలినేని, సుమంత్ రామినేని, ప్రసాద్ ఆరికట్ల తదితరులు ఈ ఫుడ్ డ్రైవ్‌లో కీలక పాత్ర పోషించారు. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ఈ ఫుడ్‌డ్రైవ్‌కు పూర్తి సహాసహకారాలు అందించారు. కరోనాపై పోరాటంలో భాగంగా పేదల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ టెంపాబే విభాగం ఈ విషయంలో చూపుతున్న చొరవను వారు ప్రశంసించారు. నాట్స్ సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.


Updated Date - 2020-07-13T15:10:44+05:30 IST