ఇమ్మిగ్రేషన్ అంశాలపై నాట్స్ వెబినార్

ABN , First Publish Date - 2020-07-01T03:26:18+05:30 IST

అమెరికాలో తెలుగు వారికి అండగా ఉండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్)

ఇమ్మిగ్రేషన్ అంశాలపై నాట్స్ వెబినార్

డాలస్: అమెరికాలో తెలుగు వారికి అండగా ఉండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్).. తాజాగా అమెరికా ప్రభుత్వం పౌరసత్వంపై తీసుకుంటున్న నిర్ణయాలు.. అవి వలసదారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ న్యాయ నిపుణురాలు శారదా కోడెం చేత ఈ వెబినార్ ఏర్పాటు చేయించింది. నాట్స్ ఉపాధ్యక్షులు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం దీనికి వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికా వీసాలపై ఎలాంటి అంక్షలు విధిస్తోంది.. ఈ అంక్షల ప్రభావం ప్రస్తుతం రకరకాల వీసాలపై అమెరికాలో ఉంటున్న వారిపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనే ప్రశ్నలకు శారదా కోడెం సమాధానమిచ్చారు. అలాగే భారత్ నుంచి వచ్చే వారికి ఎలాంటి నిబంధనలు కొత్తగా వచ్చాయనే అంశాలపై సవివరంగా శారదా కోడెం వివరించారు. అంతే కాకుండా ఇమ్మిగ్రేషన్ అంశాలపై అనేక ప్రశ్నలకు ఈ వెబినార్ ద్వారా సమాధానాలిచ్చారు.

Updated Date - 2020-07-01T03:26:18+05:30 IST