Abortion కోసం America మహిళల పోరాటం.. ఏళ్లు గడుస్తున్నా..

ABN , First Publish Date - 2021-09-05T23:44:00+05:30 IST

అమెరికాలోని స్థానిక గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు అబార్షన్ అనేది పెద్ద సమస్య. ఇప్పటికే అత్యంత దారిద్య్రంలో జీవనాన్ని కొనసాగిస్తున్న అక్కడి ప్రజలు పిల్లలను..

Abortion కోసం America మహిళల పోరాటం.. ఏళ్లు గడుస్తున్నా..

అమెరికాలోని స్థానిక గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు అబార్షన్ అనేది పెద్ద సమస్య. ఇప్పటికే అత్యంత దారిద్య్రంలో జీవనాన్ని కొనసాగిస్తున్న అక్కడి ప్రజలు పిల్లలను కని, పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు దొంగతనాలు, అత్యాచారాలు ఎక్కువగా ఉండడంతో అనేకమంది మహిళలకు అవాంఛిత గర్భాలు ధరించాల్సి వస్తోంది. అయితే వీరంతా తమ గర్భాలను తొలగించుకోవాలని అనుకున్నా.. అందుకు వీల్లేకుండా టెక్సాస్ రాష్ట్రం బ్యాన్ విధించింది. దీంతో వీరు ఇష్టం లేకపోయినా.. ఆ పిల్లలను కనాల్సి వస్తోంది. అంతేకాకుండా కటిక దారిద్ర్యంలో ఉన్నప్పటికీ ఆ పిల్లలను కూడా పెంచాల్సి వస్తోంది.


టెక్సాస్ రాష్ట్రం విధించిన ఈ బ్యాన్‌ను ఎత్తేయాలని అక్కడి మహిళలు ఎంతో కాలంగా పోరాడుతున్నారు. దీనిపై అమెరికా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా టెక్సాస్ రాష్ట్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై నేటివ్ అమెరికన్ వుమెన్స్ హెల్త్ ఎడ్యుకేషన్ రీసోర్స్ సెంటర్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కారోన్ ఎసెటోయర్ మాట్లాడుతూ.. అబార్షన్ చేయించుకోకపోవడం వల్ల అక్కడి మహిళలు అనుభవిస్తున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ఆరోగ్య పరిస్థితుల్లో ఏర్పడుతున్న అసమానతలను కోర్టు పట్టించుకోలేదని వాపోయారు. ‘మా మీద చూపుతున్న అణచివేత, క్రూరత్వానికి ఇది పతాకస్థాయి. మా హక్కు. మా మానవ హక్కు. నిర్ణయం తీసుకోగల మా హక్కును మా నుంచి లాగేసుకుంటున్నారు’ అని ఎసెటోయర్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికీ పోరాటం కొనసాగుతూనే ఉందని వెల్లడించారు.

Updated Date - 2021-09-05T23:44:00+05:30 IST