Abn logo
Jul 25 2021 @ 00:28AM

గ్రీన్‌ ఛాలెంజ్‌కు దేశవ్యాప్త స్పందన

గోదావరిఖనిలో మొక్కలు నాటుతున్న సంతోష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, వెంకటేష్‌నేత, కోరుకంటి చందర్‌ తదితరులు

- మూడేళ్లలో 2 కోట్ల మొక్కలను నాటాం.. 

- ఎంపీ జోగినపల్లి సంతోష్‌

గోదావరిఖని, జూలై 24: కేసీఆర్‌ స్ఫూర్తితో నిర్వహిస్తున్న గ్రీన్‌ ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా స్పందన లభిస్తోందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు అన్నారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం స్థానిక ఇల్లందు గెస్ట్‌హౌస్‌, పోలీస్‌ గెస్ట్‌హౌస్‌, రామాలయంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రూ.5లక్షల మొక్కలను నాటడం అభినందనీయమని, గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమంలో 3కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ఇప్పటి వరకు 2కోట్లు నాటామన్నారు. రామగుండం ఎమ్మెల్యే చందర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, జడ్‌పీ చైర్మన్‌ పుట్ట మధు, సింగరేణి డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌, ఆర్‌జీ-1 జీ ఎం కల్వల నారాయణ, రామగుండం సీపీ సత్యనారాయణ, మేయర్‌ అనీల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు పాల్గొన్నారు.