క్రీడలతో జాతీయస్ఫూర్తిని చాటాలి

ABN , First Publish Date - 2022-08-19T06:14:58+05:30 IST

క్రీడలతో జాతీయ స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. కోదాడలోని అనురాగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫ్రీడం కప్‌ క్రికెట్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు.

క్రీడలతో జాతీయస్ఫూర్తిని చాటాలి
కోదాడలోని అనురాగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫ్రీడం కప్‌ క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 18:క్రీడలతో జాతీయ స్ఫూర్తిని  చాటాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. కోదాడలోని అనురాగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫ్రీడం కప్‌ క్రికెట్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో అన్ని శాఖల ఉద్యోగులు భాగస్వామ్యం కావటం అభినంద నీయమన్నారు. అనంతరం క్రికెట్‌ను ఎమ్మెల్యే ఆడి క్రీడాకారులను ఉత్తేజ పర్చారు.  కార్యక్రమంలో ఆర్డీవో ఎల్‌.కిషోర్‌కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, సీఐలు దుర్గాప్రసాద్‌, శివశంకర్‌, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, చందు నాగేశ్వరరావు, ఖదీర్‌, చంద్రశే ఖర్‌, సూర్యనారాయణ, ఈదుల కృష్ణయ్య, బత్తుల ఉపేందర్‌ పాల్గొన్నారు. 

- క్రీడలు మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నిర్మూలనకు దోహదపడతాయని సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు.   సూర్యాపేటలోని ఎస్వీ డీగ్రీ కళాశాలలో మునిసిపల్‌ సిబ్బందికి క్రికెట్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులు ప్రతీ రోజు గంట పాటు వ్యాయామం చేయాలన్నారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, అనంతుల యాదగిరి, మునిసిపల్‌ ఈఈ జీకేడీ ప్రసాద్‌, డీఈ సత్యారావు, అధికారులు పాల్గొన్నారు. 

- విద్యార్థులు చదువులో రాణించి  భావి భారత పౌరులుగా నిలవాలని సూర్యాపేటలోని విశ్వనాథస్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు, తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యచరణ సమితి కార్యదర్శి వలివేటి వీరభద్రశర్మ అన్నారు. దేవాలయంలో విద్యార్థులకు కుర్చీలాట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గండూరి జానకమ్మ,  సహాయ అర్చకుడు వలివేటి సాగర్‌శర్మ, సతీష్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-19T06:14:58+05:30 IST