జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2020-05-29T09:11:04+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా అక్టోబరు-నవంబరులో గోవాలో జరగాల్సిన జాతీయ క్రీడలు నిరవధికంగా వాయిదా పడ్డాయి...

జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా అక్టోబరు-నవంబరులో గోవాలో జరగాల్సిన జాతీయ క్రీడలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబరు 20 నుంచి ఈ క్రీడలను నిర్వహించాలని గోవా ప్రభుత్వాన్ని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కోరింది. కానీ, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జాతీయ క్రీడలను వాయిదా వేయాలని ఆర్గనైజింగ్‌ కమిటీ విజ్ఞప్తి చేసినట్టు గోవా ఉప ముఖ్యమంత్రి మనోహర్‌ అజగావ్‌కర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఐఓఏ తెలిపింది. 

Updated Date - 2020-05-29T09:11:04+05:30 IST