NSUలో ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌

ABN , First Publish Date - 2022-07-05T21:51:00+05:30 IST

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(National Sanskrit University)(సెంట్రల్‌ యూనివర్సిటీ) - ఫుల్‌ టైం/ రెగ్యులర్‌ ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

NSUలో ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(National Sanskrit University)(సెంట్రల్‌ యూనివర్సిటీ) - ఫుల్‌ టైం/ రెగ్యులర్‌ ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది ప్రీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌. దీని వ్యవధి కనిష్ఠంగా రెండేళ్లు, గరిష్ఠంగా నాలుగేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో 120 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లోని ట్రెడిషనల్‌ సబ్జెక్ట్‌లను సంస్కృత మాధ్యమంలో, మోడరన్‌ సబ్జెక్ట్‌లను ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధిస్తారు. బాలురకు, బాలికలకు విడివిడిగా హాస్టల్‌ సౌకర్యం ఉంది.   

అర్హత: ఎస్‌ఎస్‌సీ/ సీబీఎస్‌ఈ నుంచి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సాంస్ర్కిట్‌ సంస్థాన్‌ లేదా వారణాసిలోని సంపూర్ణానంద సాంస్ర్కిట్‌ యూనివర్సిటీ నుంచి పూర్వ మాధ్యమ ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారు; ఏపీ/ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సాంస్ర్కిట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ అర్హత పొందినవారు; ఉజ్జయినిలోని మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్ఠాన్‌ నుంచి వేద భూషణ్‌ సర్టిఫికెట్‌ పొందినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి స్థాయిలో సంస్కృతం ఒక సబ్జెక్ట్‌గా చదివినవారికి, ఎన్‌ఎస్‌యూ నుంచి సంస్కృతంలో సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థి వయసు ఆగస్టు 15 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.200

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 14

వెబ్‌సైట్‌: www.nsktu.ac.in

Updated Date - 2022-07-05T21:51:00+05:30 IST